తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఈర్లగడ్డ వెంకటేశలు అనారోగ్యంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాలింకి రాము, ఎం.ఇ.ఎఫ్ సంఘాల సభ్యులు స్పందించి, ఎవరి అండ లేని మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మానవతా కార్యక్రమంలో ఆరుగొలను శాంత కుమార్, సత్తి రాజు, రవికుమార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.