నిడదవోలులో చిన్న కాశీ రేవుగా పిలవబడే మార్గాన్ని రైల్వే సిబ్బంది మూసివేశారని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిన్న కాశీ రేవు మార్గం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైల్వే సిబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.