నిడదవోలు: 'అన్నయ్యా లేవరా... నిన్నిలా చూస్తే అమ్మానాన్న తట్టుకోలేర్రా'

చాగల్లు మండలం మార్కోండపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి పెదపాటి సాయికిరణ్(20) శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వస్తూ నిడదవోలు-తాడేపల్లిగూడెం కాలువ రహదారిలో బసివిరెడ్డిపేట వద్ద మట్టిగుట్టను ఢీకొని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కళాశాల ఫెస్ట్ లో పాల్గొని ఇంటికి బయలుదేరినట్లు స్నేహితులు తెలిపారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ప్రమాద సమాచారం అందడంతో తల్లడిల్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తమ్ముడు బాలు రోదనలు అక్కడున్న వారికి కంటతడి తెప్పించాయి. పట్టణ ఎస్సై జగన్మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్