సీఎం చంద్రబాబు నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ధాన్యం పాత బకాయిలు రూ. 1000 కోట్లకు గాను రూ. 672 కోట్ల విడుదలకు అంగీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30, 988 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.