ఎన్డీఏ కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జీ. శ్రీనివాస్ నాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు అన్నారు. గురువారం నిడదవోలు పట్టణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.