నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్, తెలుగు భాష గొప్పతనం, ఔన్నత్యాన్ని, కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి ప్రమాణం చేయించారు. రాబోయే రోజుల్లో భాషా సాంస్కృతిక విధానాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.