తూ.గో జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగను నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం సిఐ పివీజీ తిలక్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి వద్ద 223 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, లక్ష రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై జగన్మోహన్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.