నిడదవోలు నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని తూ. గో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సింగవరంలో ఉపాధి కూలీలను ఆయన కలిసి సమస్యలు తెలుసుకున్నారు. గత 3 నెలలు పనిచేసిన వేతనాలు ఇవ్వటం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. నెలలు తరబడి వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు.