పేదల పెన్నిధి ఎన్టీ రామారావు: ఐటీడీపీ

పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నిడదవోలు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు.

సంబంధిత పోస్ట్