నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారికి కలవలపల్లికి చెందిన యీదర శ్రీనివాసరావు, వెంకట లక్ష్మి దంపతులు వెండి పళ్ళెం, పాదుకలను బుధవారం సమర్పించారు. ఈ కానుకలను అర్చకులు SVKA శర్మ, పి. శ్రీనివాసరావులకు అందజేసినట్లు ఏసి కార్యనిర్వహణ అధికారి విహరి సూర్య ప్రకాష్, ఫౌండర్ దేవులపల్లి రవిశంకర్ తెలిపారు. అనంతరం దాతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.