సినీ నటుడు మంచు మోహన్ బాబుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా KVPS ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు గురువారం నిడదవోలులో డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దందాపై ప్రశ్నించిన SFI నాయకులపై అక్బర్, వినోద్‌లను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించిన ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తీరు అటవీకంగా ఉందని, ఇది దిగ్భ్రాంతి కలిగిస్తుందని ఆయన అన్నారు. నిజ జీవితంలో విలన్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.