ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తూగో జిల్లా నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులలో నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాల మేరకు క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్