నిడదవోలు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కాల్దరిలో పర్యటించిన ఆయన, స్వర్ణ గ్రామ సచివాలయ భవనం, చిల్డ్రన్స్ పార్క్, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, మినీ గోకులం షెడ్డు వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.