కేంద్ర ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు పేరుతో ప్రజలపై పెట్రోలు, డీజిల్ ఛార్జీల రూపంలో రెట్టింపు భారం మోపుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు మంగళవారం నిడదవోలులో విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని, రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలు ఎన్నికలు ముగిసిన వెంటనే పెంచి కార్పోరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.