నిడదవోలు మండలం తిమ్మారాజుపాలెంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. పాస్ట్ లయన్స్ గవర్నర్ గట్టిం మాణిక్యాల రావు నూతన అధ్యక్షురాలిగా బండి అరుణకుమారి టీమ్‌ను ప్రమాణం చేయించారు. లయన్స్ రీజియన్ ఛైర్మన్ గౌరీ రావు వికలాంగ పేదవారికి రూ.2000 విలువైన గ్రైండింగ్ కుట్టు మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులను సత్కరించారు.