మద్దూరు వంతెన వద్ద కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

నిడదవోలు మండలం మద్దూరు వంతెన సమీపంలో బుధవారం సాయంత్రం ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో రోడ్డుపై బోల్తా పడగా, ట్రాక్టర్ అదుపుతప్పి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్