ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్ ప్రతిభా పరీక్షలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. క్విజ్ విభాగంలో అమరపూరి జస్సిక, పోస్టర్ విభాగంలో అమరపూరి హన్సిక ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయులు ఎన్. అరుణ రాజేశ్వరి మంగళవారం తెలిపారు. వీరు డిసెంబర్ 27న తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపికయ్యారు.