నిడదవోలు మండలం గోపవరంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు రూ. 4 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి ఫిర్యాదు చేశారు.