ఉండ్రాజవరం మండల స్థాయి వైసీపీ సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎన్. భాస్కర రామయ్య గురువారం తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిడదవోలు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ జి. శ్రీనివాస్ నాయుడు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారన్నారు. కావున పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.