రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం

నిడదవోలు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు 35-40 ఏళ్ల వయసు కలిగి, చామన ఛాయతో నలుపు రంగు జీన్స్ ప్యాంటు, కురస చొక్కా ధరించి ఉన్నాడని ఏఆర్పి వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్