వైభవంగా వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

గురువారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్