తుఫాన్ బీభత్సానికి 20 ఇళ్లు ధ్వంసం

మొంథా తుఫాను కారణంగా పెద్దాపురం డివిజన్‌లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో 20 ఇళ్లు దెబ్బతిన్నాయని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ రమణి తెలిపారు. పెద్దాపురంలో 10, కిర్లంపూడిలో 4, తొండంగిలో 2, కోటనందూరులో 3, రౌతులపూడిలో 1 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆమె వివరించారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు ఆమె తెలియజేశారు.

సంబంధిత పోస్ట్