సామర్లకోట ఐదు తుమ్ములు సెంటర్ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు చనిపోయారు. ఘటనా స్థలంలో ఒక మహిళ మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఆటో డ్రైవర్ ఎర్రిపల్లి ప్రేమ్ కుమార్ సైతం మరణించారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.