సామర్లకోటకు చెందిన డాక్టర్ మాధురి పేదలకు విశేష కంటి వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఆమెకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. సోమవారం కాకినాడలో జరిగిన 'పి-4' వార్షికోత్సవంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధ్యక్షతన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆమెను ఘనంగా సత్కరించారు. సామాజిక బాధ్యతతో వైద్యం అందిస్తున్న మాధురి సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు.