వేట్లపాలెం ఘటనలో 25కు చేరిన మృతుల సంఖ్య

సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వీర శ్రీను (39) బుధవారం ఉదయం మృతి చెందగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం లక్ష్మి (48)మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 25కి చేరింది. ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులుతెలిపారు. సామర్లకోట కొమ్మర వీధి ప్రాంతంలో మృతుల సంఖ్య పెరగటంతో ఆ ప్రాంతం శోకసముద్రంగా మారింది.

సంబంధిత పోస్ట్