నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

నగర పరిధిలోని 35వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శనివారం జరిగింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్ రావు ఆదేశాల మేరకు, నెలలో ఒకటో తేదీన అందాల్సిన పెన్షన్‌ను ముందుగానే లబ్ధిదారులకు అందించారు. ప్రతి నెలా రూ.4000 పెన్షన్ అందడం పేదలకు ఉపశమనంగా ఉందని, కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. ఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగినేని రామారావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్