సామర్లకోటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

సామర్లకోట-కాకినాడ కెనాల్ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఐదు తూములు సెంటర్ వద్ద సామర్లకోట వైపు వస్తున్న ప్రయాణికుల ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్