పెద్దాపురం–సామర్లకోట ఎడీబీ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వ్యాన్ వెనుక నుంచి మోటార్ సైకిల్ ఢీకొనడంతో, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనుక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.