ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీనివాస ప్రాంగణం వద్ద నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను త్వరితన నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆలయ ఈవో చక్రధరరావు ఉన్నారు.