జవహర్ నవోదయ విద్యాలయం, పెద్దాపురంలో 2026–27 విద్యా సంవత్సరానికి తొమ్మిది, ఇంటర్మీడియేట్ తరగతుల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి. సీతాలక్ష్మి తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు తొమ్మిదో తరగతికి 717 మంది, ఇంటర్మీడియేట్‌కు 962 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది.