పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోటలో గురువారం ఆయన మాట్లాడుతూ దొరబాబు అమెరికా పర్యటనలు మానేసి స్థానికంగా ఉంటే ఇక్కడి అభివృద్ధి పనులు తెలిసేవని హితవు పలికారు.