పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మూడో ఆదివారం అధిక సంఖ్యలో భక్తజనం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మరిడమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. క్యూలైన్లో ఉన్న వారికి కూడా మంచి నీరు, వారి పిల్లలకు వేడి పాలు అందజేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కాకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.