మరిడమ్మ అమ్మవారి జాతర సందర్భంగా శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికుల పిల్లలకు, వృద్ధులకు పెద్దాపురం, సామర్లకోట రోటరీ క్లబ్ సభ్యులు వేడి పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె. విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు తటవర్తి సత్యనారాయణ, సభ్యులు డి గంగాధరుడు, నాగరాజు, సుధాకర్, చలం, రోటరీ సామ్రాజ్య సభ్యులు ఉప్పల సోమరాజు, బొండా ఆదిత్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.