ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బుడుగు శ్రీకాంత్ కార్యాలయం నుంచి "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తిరిగి పథకాలపై ప్రజలకు వివరాలు అందించారు. ఎమ్మెల్యే వెంట పలువురు ఉన్నారు.