గురుపౌర్ణమి సందర్భంగా సామర్లకోట ఆంధ్రాగీతా సమాజం షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. లయన్స్ భీమేశ్వరా క్లబ్ అధ్యక్షుడు డా. అమలకంటి శ్రీనివాస రావు స్వయంగా బాబాకు పుష్పార్చన చేసి, వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు దవులూరి సుబ్బారావు, దన్నాల అప్పారావు, కోప్పన రాంబాబు, గండ్రోతుల సత్యనారాయణలు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.