పెద్దాపురం మార్కెట్‌లో చేపల దుకాణాల నిర్మాణాలను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం పరిశీలించారు. రేకుల షెడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు అవసరమైన మార్పులు చేయాలని సూచనలు చేశారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఇతర అధికారులు ఆయనతో ఉన్నారు.