పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మామిడి చక్రమ్మ కుటుంబాన్ని ఆర్డీవో కె. శ్రీరమణి దత్తత తీసుకున్నారు. బుధవారం ఆమె ఆ కుటుంబాన్ని కలిసి, వారి అవసరాలను స్వయంగా తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు ఆర్డీవో మీడియాకు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో మరో మూడు కుటుంబాలను కూడా దత్తత తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.