పెద్దాపురం పట్టణం మహారాణి కళాశాల ప్రాంతంలో ఉన్న విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్తు శాఖ ఈఈ ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. సుధాకాలనీ, బ్యాంకు కాలనీ, యానాదులకాలనీ, కొండయ్య పేట, పద్మనాభకాలనీ, ఏపీ నగర్, సామర్లకోట రోడ్డు, రామారావుపేట, మున్సిపల్ సెంటర్, ఆర్టీసీ బస్ స్టేషన్, ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.