ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం సామర్లకోట 10వ వార్డులో లో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే చినరాజప్పకు మంగళ హారతులతో స్వాగతం పలికి ఆశీర్వచనం పలికారు.