సామర్లకోటలో పోలీసుల సైకిల్ ర్యాలీ

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆదివారం సామర్లకోటలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం ఎస్డీపీఓ ఏబీజీ తిలక్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైకిల్ ప్రయాణం శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఎస్డీపీఓ తిలక్ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, సీసీఎస్ సిబ్బంది పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్