సామర్లకోట: హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ర్యాలీ

సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో నొక్కు కిరణ్ కార్తీక్ అనే యువకుడు హత్యకు కారణమైన దోషూలను వెంటనే శిక్షించాలంటూ గ్రామస్తులు, యువత గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని కనకదుర్గ ఆలయం దగ్గర నుండి కొవ్వొత్తులతో గ్రామ పురవీధుల్లో నినాదాలు చేస్తూ గ్రామస్తులంతా ర్యాలీ చేపట్టారు. కిరణ్ కార్తీక్ హత్య వెనుక ఉన్న దోషులకి చట్ట ప్రకారం తగిన శిక్ష పడాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్