నల్లజర్ల మండలంలోని దూబచర్లలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.