వేట్లపాలెం ప్రమాద బాధితులకు అశ్రు నయనాలతో వీడ్కోలు

వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మరణించిన వారికి ఆదివారం ఉదయం స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఐ కృష్ణ భగవాన్ బృందం భారీ బందోబస్తును నిర్వహించింది. కొందరిని క్రైస్తవ పద్ధతిలో ఖననం చేశారు. బాధిత కుటుంబాల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్