సామర్లకోట మండలం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్‌లో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను అధికారులతో సమన్వయం చేసి త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం, ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.