పెద్దాపురంలోని నువ్వులగుంట వీధిలో నివసిస్తున్న వీరా దుర్గా వీరభద్ర సాయి (28) ఉరి వేసుకుని గురువారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధ తాళలేకనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై వి. మౌనిక దర్యాప్తు చేస్తున్నారు.