గ్రామస్థాయి నుంచి ఫైవ్ మాన్ కమిటీని ఏర్పాటు చేయాలి.. పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఫైవ్ మెన్ కమిటీలను నియమించి, సింగిల్ మెన్ ఆధిపత్యానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలో ఆయన కీలక పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జనసేనపార్టీని మరింత బలోపేతం చేసే దిశగా, పిఠాపురం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో తక్షణమే 'ఫైవ్ మెన్ కమిటీలను' నియమించాలని ఆయన ఆదేశించారు. ఈ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్