గొల్లప్రోలు మండలంలోని చెందుర్తి గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి (గ్రావెల్) తరలిస్తున్న రెండు లారీలను రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ బి. వి. భాస్కర్‌రావుకు అందిన సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. లారీలను సీజ్ చేసి, డ్రైవర్లు అప్పికొండ అయ్యప్ప, చింతల వెంకటరాజులపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న గ్రావెల్ విలువ సుమారు రూ. 3 వేలుగా అంచనా వేశారు.