కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలం నాగులపల్లి రక్షిత మంచినీటి చెరువులో మూడు రోజులుగా చేపలు పెద్ద ఎత్తున మృతి చెందుతున్నాయి. దీంతో చెరువు నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పరిస్థితి కారణంగా, సమీపంలోని 18 గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి నాణ్యతపై ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.