కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, పిఠాపురం నియోజకవర్గంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం ఆధునిక సదుపాయాలతో కూడిన వృద్ధాశ్రమం ఏర్పాటు కానుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మిషన్ శక్తి పథకం కింద ఈ ఆశ్రమ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సురక్షిత వసతి, వైద్య సేవలు, పోషకాహారం అందించేలా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల నియోజకవర్గంలోని వృద్ధులకు మెరుగైన సంరక్షణ లభించనుంది.