పోషణ్ పక్వాడలో అవగాహన కార్యక్రమం

పోషణ్ పక్వాడ పక్షోత్సవాల సందర్భంగా పిఠాపురంలో గురువారం తల్లి-శిశు సంరక్షణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులకు వైద్యులు, అధికారులు మార్గదర్శకాలు అందించారు. గర్భిణీలు సమతుల ఆహారం తీసుకోవాలని, నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవాలని యూహెచ్‌సీ వైద్యుడు డా. వినయ్ సూచించారు. స్థానికంగా లభించే పోషకాహార పదార్థాలతో వంటలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ రమేష్, ఐసిడీఎస్ సూపర్వైజర్ ప్రభావతి తెలిపారు. జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం అని సీడీపీవో సత్యనారాయణమ్మ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్